
సీతారాములు, లక్ష్మణుడు పంచవటిలో ఉండగా, శరదృతువు గడిచి హేమంత ఋతువు ప్రవేశించగానే లక్ష్మణుడు ‘అన్నా నీకు ఎంతో ఇష్టమయిన హేమంత ఋతువు మొదలయ్యింది చూడు ‘ అంటాడు. చాలా ఏళ్ళుగా ఈ మాటలే నా మనసులో నాటుకుపోయాయి. కాని ఇవాళ మళ్ళా రామాయణం తెరిచిచూద్దును కదా, మొదటి మాటలే ఇలా ఉన్నాయి:
వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః
శరద్వ్యపాయే హేమంత ఋతు రిష్టః ప్రవర్తతే (అరణ్య:16:1)
(మహాత్ముడైన రాఘవుడు అక్కడ సుఖంగా నివసిస్తూ ఉండగా, శరదృతువు గతించి, ఇష్టమయిన హేమంత ఋతువు ప్రవేశించింది.)
‘హేమంతఋతురిష్టః ప్రవర్తతే.’ చాలా ఇష్టమైన ఋతువు. ఎవరికి? కవికా? రాముడికా లేక నా ముందున్న తాత్పర్యంలో రాసినట్టుగా సకల ప్రాణులకా?
ఎవరికి ఇష్టమో తెలియాలంటే, ఎప్పుడో మోహనరాగంలో హేమంత ఋతువు మీద నేను చేసిన ప్రసంగం వినకూడదూ!
కవి అన్నట్టుగా హేమంతమంతా ఒక కనకప్రభ. ఆ పసిడి వెలుతురుని నేను మీతో ఇలా పంచుకోవాలి అనుకుంటున్నాను. ఒక్కసారి విన్నా సరే, వీలైనప్పుడల్లా విన్నా సరే. ఈ ప్రసంగాన్ని మీ మొబైల్లో డౌన్ లోడ్ చేసుకుని విన్నా సరే.
8-12-2022