ఎల్లలోకము ఒక్క ఇల్లై

నేను ఫేస్ బుక్ మాధ్యమంలో 2009 లో ప్రవేశించినా రెగ్యులర్ గా రాయడం మొదలుపెట్టింది 2012 నుంచి. ఈ మధ్య కాలం పదేళ్ళలో ఎన్నో అంశాల మీద సుమారు వెయ్యి పోస్టులు పెట్టి ఉంటాను. వాటిని పుస్తక రూపంలో వెలువరించమని మిత్రులు చాలాకాలంగా అడుగుతూ ఉన్నారు. అందుకని, ముందుగా, వాటిలో కవిత్వం మీద రాస్తూ వచ్చిన వ్యాసాల్లో, తెలుగు కవిత్వం మీద రాసినవాటిని దశార్ణదేశపు హంసలు పేరిట 2019 లో ఇ-బుక్ విడుదల చేసాను. దాన్ని పెద్దలు సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారికి అంకితమిచ్చాను.

తెలుగు కాక, తక్కిన ప్రపంచ భాషా సాహిత్యాల్లో నేను చదివిన కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఇప్పుడు ఈ రూపంలో మీకు అందిస్తున్నాను. ఆరు ఖండాలు, ముప్పైకి పైగా భాషలు, 182 వ్యాసాలు, 912 పేజీలు. వందేళ్ళ కిందట, మహాకవి, ఎల్లలోకము ఒక్క ఇల్లు కావాలని కలగన్నాడు. ఆ కలని కవిత్వం నిజం చేస్తుందన్న భావనతో ఈ పుస్తకానికి ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై ‘ అని పేరు పెట్టాను.

గత పాతికేళ్ళుగా నాకు రచనావ్యాసంగంలో తోడుగా నిలబడ్డ ఎమెస్కో ప్రచురణ సంస్థకి ఈ పుస్తకం ప్రేమగా కానుక చేసాను.

మీరు కూడా దీన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం మొబైల్ మీదగాని, సిస్టం లో గాని, లాప్ టాప్ లో గాని, కిండిల్ లోగాని, టాబ్ లో గాని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ మిత్రులకి ధనుర్మాసం కానుకగా, క్రిస్మస్ కానుకగా, నూతన సంవత్సర కానుకగా పంపవచ్చు. పుస్తకం చదివాక, మీకు నచ్చితే రెండు మాటలు నాతో, లేదా మీ మిత్రులతో పంచుకోగలరు.

28-11-2022

3 Replies to “ఎల్లలోకము ఒక్క ఇల్లై”

Leave a Reply

%d bloggers like this: