రాజమండ్రి డైరీ-9

Reading Time: 3 minutes

24-9-1986

ఆఫీసులో పని ఒత్తిడి మధ్య అనుకుంటూ వున్నాను- ఈ దినచర్యని బట్టే ఎవరి జీవితాన్ని అయినా asses చెయ్యవచ్చు అని. ఎవరన్నా సామాజిక కేంద్రంలో నిల్చొని మార్పు కోసం మాటాడేవాళ్ళు, ముందు తమ routine ని అందుకు పరీక్ష పెట్టాలి. ఈ routine, దీని బదులు, ఒక కొత్త దినచర్య ఇవ్వగలరా? దాన్లో తమ శుభ్రత, రమ్యత, తమ ఆలోచన అన్నీ ప్రతిఫలించాలి- మనకి స్పష్టంగా తెలుసు., మన యుద్ధం మన daily life తోనే అని. శాంతి అంటే ఎక్కడో లేదు. ఇప్పుడే, ఇక్కడే దాన్ని పొందాలి. కాని అది ఇట్లాంటి అలసటలో, కునికిపాట్లలో supervision లో అణగిపోతున్న ఆత్మలో, చాలీచాలనితనంలో, చాడీల్లో, ఆడవాళ్ళమీద జోకుల్లో-వీటిమధ్య వస్తుందా? ఎలా వస్తుంది?

దినచర్య ఆత్మనుంచి వస్తుంది. ఆత్మ దైనందిన జీవితంలోంచి రూపొందుతుంది. ఇక్కడ ఏది దేన్ని destroy చేస్తూంది? మంచి హృదయమున్న మనుషులు మన దినచర్యలో భాగమయితే, అప్పుడు ఆత్మ ఈ బండబారిపోవడం నుంచి కాస్త కాస్త ప్రాణం పోసుకుంటూ వుంటుంది. కాని, ఏరీ అలాంటివాళ్ళు?

25-9-1986

ప్రసాద్ నుంచి ఉత్తరం. ‘నీది బహుశా everlasting fire కావచ్చు. దాన్నుంచే నీ creation, achivements  కూడా వస్తూండవచ్చు’ అని. in a reconciliatory tone with due respects to what I have written. సో-గురించి mentioned something disturbing.

రాత్రి చాలాసేపటిదాకా రామకృష్ణతో.

రోజూ నిద్రవేళ-ఒకప్పటి ఆత్మీయమైన మనుషులందరూ గుర్తు రావడం, ముఖ్యంగా..

26-9-1986

సాయంకాలం గౌతమీలో చిలకమర్తి పైని సోమసుందర్ ప్రసంగం అంటే వెళ్ళాను. కాని ఫాలో అవలేదు. మిత్రుల్తో పాటు కళాకేంద్రానికి. బి.ఎస్, రతన్ లాహిరీ బృందం. కళాకేంద్రంలో శంకర్ స్మారకోత్సవం. రామనాథాన్ని లాహిరీకి పరిచయం చేసాను.

రామనాథం మద్రాసులో భరణిని కలిసాడుట.. టివి ఫిల్మ్ కి అవకాశం వచ్చిందిట. థీం చెప్పాడు, parents employees  అయిన యింట్లో పిల్లలు పొందే నిరాదరణ, దీన్ని కొన్ని interesting episodes గా తీసుకురావాలిట, నన్ను ఆలోచించమన్నాడు.

రాతి బి.ఎస్ అంటున్నాడు. ‘మిమ్మల్ని, గోపీని రోజూ కలవకపోతే ఏదో ఒక vacuum..’. ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, trueగా, lovableగా, గొప్ప గౌరవాన్ని పొందడానికి అర్హుడిగా ఉంటాడు. కాని మళ్లీ తెల్లవారి, అతని లోపాలు, incapability వేరే చిత్రాన్ని విరుద్ధంగా చిత్రిస్తాయి.

27-9-1986

రాత్రి సదనంలో సోమసుందర్ కవితాగానం. poor versification. అతనితో గాని, ఆ కవితతో గాని problem లేదుగాని, ఎన్నాళ్ళనుంచో లోపల లోపల వున్న fractionsయివాళ బయటపడ్డాయి…

పాతతరంతో ఏమీ పేచీలేదు. అది గతించిపోయిన తరం. కాని సమస్య అల్లా, ఇప్పుడు మనతో పాటు, ఇంతే serious గా literature ని approach అవుతున్న కొత్తతరం. వీళ్ళల్లో ఇంత ద్వంద్వం, ఇంత వంచన వుంటే ఎట్లా?

28-9-1986

ఉదయం ఆర్కెష్ట్రా పైని సమాలోచన. well participated. చాలా ఉల్లాసంగా జరిగింది. ఆ పుస్తకం దాని ఆవిష్కరణ నుండి ఇవాల్టిదాకా కూడా అది matter of importance గానే వుంటూ వుంది. దాన్లోది కవిత్వమా, కాదా అంటే-శిల్పరీత్యా ఉండే అసంతృప్తి ఎప్పుడూ వుంటుంది. దాని గురించి మాట్లాడటానికి, ఒక రకంగా అధికారం కూడా లేదు. కాని అది ఒక గొప్ప బృందగానం. common experience లోంచి పుట్టింది. ప్రేమించుకోవడం, నిరసించుకోవడం, కలవడం, విడిపోవడం- యీ జీవితం నుంచి పుట్టింది. గోపీ అన్నట్టుగా it is without pretentions, sincere and naive.

రవీంద్ర ఉదయాన్నే వచ్చాడు. నిర్వికల్ప సంగీతం పుస్తకం ‘కవిగా చలం’ పుస్తకంలా వుందన్నాడు. with his affectionate presence. మధ్యాహ్నం వరలక్ష్మి ఇంట్లో భోజనం. ఆ అమ్మాయి పుట్టినరోజు. పాపాజీ వాళ్ళ స్నేహితురాళ్ళు కూడా వచ్చారు. పాపాజీని గోపీచంద్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను.

రాత్రి గోపీ, బి.ఎస్., రామకృష్ణ నా రూమ్ లో. కాసేపు సంగీతం. కాసేపు క్రికెట్, కాసేపు కవిత్వం. గాంధీ జయంతి నాడు రీడర్స్ క్లబ్ ఏర్పాట్లు గురించి.

Rotary వాళ్లు best Youngman గా యీ సారి గోపీని select చేసారట. సుదర్శనంగారితో పాటు. ‘ఇది సాహితీవేదికకి అవార్డు అంటున్నారు మిత్రులు.

29-9-1986

గ్రూప్-1 సర్వీస్ మెయిన్ పరీక్షలు పాసయినట్టుగా పేపర్లో results. చాలా hopeful గా అన్పించింది.

30-9-1986

సాయంకాలం సన్నని వానజల్లుపడుతోంటే, మాష్టారితో మాటాడుతూ ఆయన staff room లో కూచొన్నాను. ‘మీకు యీ disappointment ఎందుకేర్పడుతోంది? ఇది మీ స్వభావం కాదు. మీకు క్రికెట్టు అనే ఆట వుందని తెలియవల్సిన అవసరం ఏముంది? ఇంతకాలం ఎలా ఒక తపస్సుగా కొనసాగించేరో ఇక మీదా అలాగే చెయ్యండి ‘ అన్నాను. ఇంకా ఇలాగే నా కుర్రతనపు నీతిబోధలు. ఆయన నిర్లిప్తంగానూ, నా పట్ల అమితమైన concern తోనూ అదంతా విన్నారు. ‘నేను ఇవి ఎప్పుడూ పట్టించుకోనేలేదు. ఏదో అప్పుడప్పుడూ తాత్కాలికంగా అలా అన్పించడం తప్ప మరేం లేదు’ అన్నారు.

గ్రూప్ సర్వీసెస్ రిజల్ట్ నన్ను కాస్త స్తిమితం తప్పించింది. మార్పుకోసం, కాస్త మంచి స్థితికోసం లోపల విధికి అణగివున్న కోరిక, hopes నన్ను మరీ అల్లరి పెడుతున్నాయి. ఏవేవో వూహలు, కలలు..కాని ఏదో ఒక మూల నిర్లిప్తంగా, వీటిని గమనిస్తో, ‘మరో ఇవాన్ ఇల్యిచ్ మరణానికి సన్నద్ధుడవుతున్నాడు ‘ అనుకుంటున్నాను కూడా. ‘ఇది నా మిత్రుడి కథే. అ రోజు పరీక్షాఫలితం తెలిసినప్పుడు-ఈ రోజుతో నా కష్టాలన్నీ గట్టెక్కాయనుకున్నాడు అతను. కాని నిజానికి ఆ క్షణానే అతడు మరణించడం మొదలుపెట్టాడు..’ ఇలా సాగుతుందన్నమాట యీ కథ.

1-10-1986

ఉత్సాహపూరితమయిన సాయంకాలం. Best Youngman గా గోపీచంద్. వాళ్ల lab మిత్రులూ, వేదిక మిత్రులూ, మాష్టారూ వచ్చారు.పూలదండలు, ఫొటోలు, కబుర్లు, శ్రోతలు..

‘వ్యక్తిగా ఎదగడం, జీవితాన్ని అర్థం చేసికుంటూ సమన్వయపరచుకోవడం ఏ సాహిత్యవిద్యార్థికయినా ఇదే ముఖ్యంగా వుండాలని నా నమ్మకం ‘ అన్నాడు గోపీ తన reply లో.

సాయంకాలం సుబ్బూ పుట్టినరోజు. get together.

16-10-2022

Leave a Reply

%d bloggers like this: