రాజమండ్రి డైరీ-6

Reading Time: 3 minutes

27-8-1996

.. కాఫ్కా డైరీలు.

Unveiling that enigmatic personality in remote corners.

28-8-1986

కొత్త బట్టలు. నాలోంచి చిన్నపిల్లాడు కాసేపు బయటికి వచ్చి సరదా పడి వెళ్ళిపోయాడు.

evening with Ramakrishna. అతనికి ఏదో కావాలి. ఏదో వెతుక్కుంటాడు. అది రచయితలూ, కవులూ ఇవ్వగలరా? నేను బద్ధకంగా, నీరసంగా అతనితో తిరుగుతున్నానే తప్ప-అతనికేమీ ఇవ్వలేకపోతున్నాను.

సత్యభాస్కర్ ముక్తిబోధ్ poem translate చేసి విన్పించాడు. ‘బ్రహ్మ రాక్షస్’. అద్భుతంగా వుంది. గొప్ప అభివ్యక్తి. ‘ఎంతో, ఎంతో దగ్గరి వాడు, బైరాగికీ, నాకూ, మనందరికీను ‘ అన్నాను.

రాత్రి గోపీచంద్ తో కలిసి ఆర్.ఎస్ దగ్గరికి. ఆయన ఇవాళ చాలా ఉల్లాసంగా ఉన్నాడు. ఏవేవో ఎప్పటివో కబుర్లు. ఆనాటి గొప్ప సారస్వత వాతావరణం.. ఇప్పటి ప్రపంచం.. రాత్రి చాలాసేపు KG తో ఇంటిదగ్గర కూచొని చర్చ.

29-8-1986

కాఫ్కా. ఇవాళ మళ్ళీ Thomas Mann వ్యాసం చదివాను. మరింత స్పష్టపడ్డాడు. ఆయన డైరీలు చదువుతున్నాను. profound observation. అన్నిటికన్నా ముఖ్యం గొప్ప sincerity. నిజాయితీ ఒక value గా కాదు, బాహ్యాంతర్యాల మధ్య వ్యత్యాసం లేని ఒక జీవితవిధానంగా. ఆయనలోని energy ఇదే అన్పించింది. అది రాసాడు కూడాను.

‘… a self perception to be established definitively in writing only when it can be done with the greatest completeness with all the incidental consequences, as well as with entire truthfulness (p.35)

ఈ incidental consequences అన్నది ఆయనకే బాగా వర్తిస్తుంది. ఆ మాటకొస్తే, western రచయితలందరికీ. వాళ్ళ చూపు చాలా తీక్ష్ణంగా ఉంటుంది. అందుకే అంత powerful realism పుట్టింది వాళ్ళ నేలలో.

30-8-1986

సాహిత్యం శక్తిలేనిదని ఎవరన్నారు? టాల్ స్టాయిని చదివిన తర్వాత నాలో వస్తున్న మార్పుని నేను గుర్తిస్తూనే ఉన్నాను. అయితే ఇంకా విశుద్ధమయిన హృదయమున్నవాడూ, నిజాయితీపరుడు ఇంకా ఎక్కువ మార్పు చెందుతాడు. బహుశా గాంధీగారికీ, మనకీ తేడా అక్కడేనేమో.

మధ్యాహ్నం శరభయ్యగారి college roomలో. బి.ఎస్ కూడా ఉన్నాడు. గణపతినవరాత్రుల్లో ఆయన ప్రసంగ విషయం గురించి ఆలోచన.

రాత్రి రామకృష్నతో గోపీచంద్ ఇంటికి. కాసేపు ‘మళ్ళీ వసంతం’ గురించి చర్చ. ఇంకా ఏవేవో.

అన్నిటీ గుర్తూ ఒక్కటే. ఏదో లోపిస్తున్న సాయంకాలాలు. దేన్నో ప్రతీక్షిస్తున్న దినాలు. ఎవర్నో misss అవుతున్న మిత్రబృందాలు. ఎందుకో తెలియని ఆర్తి.

31-8-1986

early గానే చేరాను ఇంటికి. మల్లుని మధ్యాహ్న భోజనానికి పిలిచాను. అమ్మా, పాపాజీ ప్రేమగా పెట్టింది తిని మామిడి చెట్టు నీడన మంచాలు వాల్చుకుని విశ్రాంతి. జ్వరమంతా ఎగిరిపోయిందన్నాడు మల్లు.

శరభవరం వెళ్ళాలనుకున్నానుగానీ కుదరలేదు… మళ్ళీ ఆరుబయట నక్షత్రాల్ని చూస్తో నిద్రలోకి.

 a pleasant and lazy day.

2-9-1986

లోపల అంతా శూన్యంగానూ, భావరహితంగాను ఉన్నప్పుడు బయటి ప్రపంచం స్ఫురణకొస్తుంది. అంతా వస్తువుల ప్రపంచంగా కన్పిస్తుంది. ఇప్పుడట్లా వస్తువుల dimensions మీంచి జారుతున్నాను. పలకలుగా, cubesగా, రంగులుగా, మెరుపులుగా ఉన్న ప్రపంచం మీద ఒక creeper లాగా పాకుతూ, జారుతూ..

సాయంకాలం రామకృష్న రాజ్ దర్బార్ బార్ లో పార్టీ. ..

ఎన్నాళ్ళనుంచో నలుగుతున్న theme ని కథ1గా ఉపక్రమించాను. టాల్ స్టాయిని చదివిన తర్వాత clarity వచ్చింది. అయితే స్వామి సేర్గియ్ కీ దీనికీ పోలికలు ఉన్నాయని మాత్రం అనుకోలేం. my own theme and projection of my own vision of truth.

3-9-1986

పేపర్ మిల్లులో violence. వర్కర్స్ seize చేసి Heads of the depts ని కొట్టారుట. వెంట తరిమి మరీ. ఇంత madness ఎంత long and impatient suppression లోంచి వచ్చిందో. ఎంత struggle అయితే హింసకి పూనుకుంటారు! అయినా హింస హింసే. గోపీచంద్ చెప్తుంటే చాలా కష్టంగా అన్పించింది. ఏదో ఒకరోజు యీ దేశానికి కూడా యీ గతి పడుతుంది.

కథ పూర్తిచేసేసాను. సంతృప్తికరంగా వచ్చింది. సాయంకాలం పార్కులో రామకృష్న, ఇతర మిత్రులూ విన్నారు. చాలాసేపు చర్చ నడిచింది. రామకృష్న మంచి చర్చే లేవనెత్తాడు.

ఏదో చేస్తున్నా, ఎక్కడో వున్నా mill problem mind లో occupy అయ్యే వుంది. రాత్రి సమస్య ఒక పరిష్కారానికి వచ్చిందన్న వార్త. ఫైరింగ్, chlorine cylinders blasting అంతా తప్పిపోయిందనీ, tension release అయిందనీ వినగానే రిలీఫ్ గా అనిపించింది. ‘పిట్టల్ని కాల్చినట్టు కాల్చేద్దుం. కానీ వాళ్ళ దగ్గర క్లోరీన్ సిలిండర్లున్నాయి ‘అంటున్నాడు క్రైమ్ ఇన్ స్పెక్టర్ పొద్దున్న. ఎట్లాంటి దేశం? ఎట్లాంటి కాలం!

4-9-1986

బైరాగి ‘పాప పోయింది ‘ చదువుతున్నాను. చాలా simple tone లో చెప్తున్నాడు. mood create చేస్తున్నాడు.

అక్క ఫోన్ చేసింది. రెండు మూడు వారాలుగా చూస్తున్నామనీ, యీ సారి రమ్మనీను. మాట్లాడాల్సిన పనికూడా వుందనీను.

5-9-1986

బైరాగి పుట్టినరోజు. బహుశా ఆయనే ఎన్నడూ జరుపుకుని వుండడు. కాని శిశువులాంటి ఆ కవిని ఇంతకన్నా స్మరించుకునే మార్గమూ లేదు.

సుదర్శనంగారు- సహజంగానే- తన heights లోంచే మాట్లాడారుగానీ, ఎందుకో dissatisfactory గా వుంది. అలాగే ఆయన చాల అభిప్రాయాలూ వివాదాస్పదంగా వున్నాయి. ఆయన భావనలో కూడా ఆధునికుడు కాడు. ఆధునికుడే, కాని, దాని utlimateness దృష్ట్యా కాదు. కవి process కవే పడాలి, ఆ process లోంచి ఏ vision పొందుతాడో దాన్ని బట్టి చెప్పిందే కవిత్వం-ఇంతకన్నా ప్రాచీనమయిన కావ్యవిమర్శ ఏముంటుంది గనక?

నేను మళ్ళీ mental dependence కీ లోనయి పోతున్నాను. దీన్ని ఖండించుకోవాలన్న విషయం ఇలా ఇలా గుర్తొస్తూంటుంది.

6-9-1986

రాత్రి కాకినాడలో.

అక్కా, బుజ్జితో కబుర్లు. రాజా అల్లరి. బామ్మగారి ప్రసన్నత. బావగారు.

7-9-1986

రాత్రి టివిలో గుల్జార్ ‘పరిచయ్ ‘.

14-10-2022

———————-

1 గోధూళి కథ. ఆ ఏడాదే ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం.

Leave a Reply

%d bloggers like this: