రాజమండ్రి డైరీ-5

Reading Time: 3 minutes

7-8-1986

బంద్-సెలవు.

మధ్యాహ్నం దాకా సుబ్బూ ఇంట్లో. రామకృష్నతో differences బయటికి తొలగించేసాను. మధ్యాహ్నం అతనితో. సాయంకాలం గోదావరికి హైదరాబాదు వెళ్తున్నాడు. విజయుడు, శరత్ మద్రాసు విశేషాలు చెప్తున్నారు.

ఇంకా అలాగే మిత్రుల్తో. బాలసుబ్రహ్మణ్యం.

పేరుకుంటున్న శూన్యం ఇవ్వాళ కాస్త కదిలింది. ఏవో మాటలు, శబ్దాలు దాన్ని అటూ ఇటూ ఎదిర్చాయి. But, it again appears tomorrow with more mistiness..

8-8-1986

ఈ ఉద్యోగం ఎంతోకాలం చెయ్యలేనన్న విషయం స్పష్టపడుతోంది. అంతేకాదు, ఇలాంటి ఉద్యోగాలు ఏమీ చెయ్యలేను, ఎందుకంటే, చెయ్యవలసిందేమీ వుండదు కనుక.

9-8-1986

వర్షంలో కాకినాడకి. heavy headache.

రాత్రి సి.ఎస్ ని కలిసాను. అతని కథ, ఫెయిర్ చేసి, ఇచ్చాను. చాలా ఆనందపడ్డాడు. చాలాసేపు మద్రాసు కబుర్లు, మధ్యలో వంశీ ప్రసక్తి.

సోమయాజులు నుంచి విజయవాడ సంగతులు, హైదరాబాదు సంగతులు. ‘చాలాకాలం తర్వాత విలువయిన పుస్తకం1 వచ్చింద ‘న్నాడుట మో.

12-8-1996

సాయంకాలం వర్షంలోనే ఏదో credit syndicate meeting లో మిత్రులం. రామకృష్న, సుబ్బూల్తో పాటు.

సుబ్బూతో పాటు వాళ్ళ ఇంట్లో భోజనం. కబుర్లు. అర్థరాత్రి వర్షంలో ఇంటికి.

ఎడతెరిపిలేని వర్షం.

Vedic Literature ని follow అవుతున్నాను. కొన్ని హిమ్స్ note చేసికొన్నాను.

‘వరుణదేవుడా, నా జీవితసూత్రాన్ని తెగనివ్వకుండా నా సంగీతాన్ని అల్లుకునేటట్టు అనుగ్రహించు తండ్రీ’

13-8-1986

పీడలాగ వర్షం.

పట్నమంతా జలమయమవుతోంది.

14-8-1986

సాయంకాలం ఆఫీసులో songs competition- రామకృష్న, బాలసుబ్రహ్మణ్యం judges. బాగా జరిగింది. ఆఫీసులో ఇంతకాలానికి కాస్త ఉల్లాసకరమైన atmosphere. కాని యీ కాస్సేపే.

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం- threats of overflow or breach. రాత్రి వెన్నెల్లో మెరుస్తున్న వరదనీటి అంచున మిత్రుల్తో కబుర్లు.

15-8-1986

కన్నీళ్ళమధ్య అయోమయం మధ్య ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం.

ఉదయం ఆఫీసులో function. మాట్లాడేను.

మధాహ్నం బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో భోజనం. ఇవాళ అతని పుట్టినరోజు.

శరభయ్యగారిని కలిసాను. పుస్తకం1 ఇచ్చాను.

రాత్రి మళ్ళీ గోపీ చంద్ తో వాళ్ళ ఇంటికి.

ఈ రోజు ఏదో festive atmosphere ఇంతా confusion మధ్యా.. సాయంకాలం అలమికుంటున్న వెన్నెల్లో-ఏదో బెంగ, రోజు గడిచిపోతోందంటే.

16-8-1986

ఊరంతా ఒకే madness. ఏ క్షణాన గోదావరికి గండిపడుతుందో అని భయం. అంతా war time లాగా వుంది.

సాయంకాలానికి ప్రమాదం తప్పిపోయింది. It swept away the  western bank. నిహంగా ప్రమాదానికి గురయిన చోట్ల ఏ సహాయాలూ లేవు, ఏ బందోబస్తులూ లేవు, ఎట్లాంటి పునరావాస ప్రయత్నాలూ లేవు.

17-8-1986

అనారోగ్యం.

బయటకి కదల్లేదు. ‘సావిత్రి’ చదువుతూ వుండిపోయాను.

మధ్యాహ్నం టివిలో ‘ఒక ఊరి కథ’. గొప్పగా తియ్యకపోయినా, ప్రేమ్ చంద్ కి న్యాయం చేసాడు. ..

సాయంకాలం సుదర్శనంగార్ని కలిసాను.

18-8-1986

మళ్ళీ routine. ఇదిలా కొనసాగుతూంటేనే నయం, accoustom అయిపోతాం.

సుదర్శనంగారి ‘మళ్ళీ వసంతం ‘. బాగా రాసారు. దాన్లో ఆయన ప్రదర్శించిన quest, దాని విలువ అలా వుంచి, ఒక మామూలు కథగా కూడా అది అందంగా వుంది.

సాయంకాలం ముళ్ళపూడి శ్రీనివాస ప్రసాద్ స్టూడెంట్ అనుకోకుండా తారసిల్లాడు. పుస్తకాలు1 పంపించాను.

గోపీచంద్ తో ఒక వూరి కథ మీద చర్చ.

చాలాసేపు వరద విషయాలే. ఏదన్నా Relief programme లోకి చేరి వుండాల్సింది. చాలా guilty గా వుంది. అతనికి మరీను.

19-8-1986

రామనాథానికీ, గురజాడ కళాసమితికీ పెద్ద దెబ్బ2 అనీ, అతన్ని అంత tragic situation లో ఎప్పుడూ చూడలేదన్నాడు రామకృష్న.

వరద వార్తలు వింటున్నకొద్దీ, పత్రికల్లో చదువుతున్న కొద్దీ-చెప్పలేని నిర్వేదం ఏదో ఆవరిస్తోంది. ప్రతి ఒక్క వార్తా ఎంత కటువుగా వుంటోందని. natural  కొంతా, మనుషుల దుర్మార్గం కొంతా. రెండోదే ఎక్కువ బాధిస్తూన్నది.

బయట ప్రజలు అట్లా suffer అవుతోంటే, నేను నా daily life లో. కాని ఏం చెయ్యను? ఏం చెయ్యగలను? బాధితులు తమ బాధ మధ్యనుంచే శక్తి తెచ్చుకుంటారు- ఇప్పుడు కాకపోతే కొన్నేళ్ళకయినా దీన్నుంచి recover అవుతారు. కాని ఇది నాలో కలిగిస్తున్న కాఠిన్యం నుంచి మాత్రం నాకు విముక్తి లేదు.

20-8-1986

నీరసం, bad health.

సాయంకాలం రామకృష్న ఇంటికి తీసుకువెళ్ళాడు. రాత్రి అక్కడే. చాప్లిన్ ‘సిటీ లైట్స్ ‘ రెండో ఆటకి.

అద్భుతమైన వెన్నెల.

పూర్వజ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ.

‘మూర్ఛిల్లిన యాత్రాంతం, గిర్రుమనే జ్ఞాపకాలు.3

టాల్ స్టాయి-ఏం అద్భుతంగా వున్నాడు!

అతను ఒట్టి ఆదర్శవాది అనుకునేవాణ్ణి. He is too realistic. అయితే, Christian reality, with a capital C.

‘ఇవాన్ ఇల్యిచ్ మరణం’- థియోడర్ డ్రెస్సర్ అనుకున్నట్టే నేనూ అనుకోవాలి.

ప్రపంచమంతా నా శ్రోత అయితే!

21-8-1986

టాల్ స్టాయి నన్ను convince చేస్తున్నాడు. సత్యాన్ని విశదపరుస్తున్నాడు. కథకుడిగా ఆయన ఏమంత గొప్ప శిల్పి అని? కాదు, ఆయన్ని ఒట్టి రచయితగా వూహించలేకపోతున్నాను. one of the rarest conscience keepers of mankind.

ఎంత గొప్ప జాతి రష్యన్లు!

సాయంకాలం, అంటే రాత్రే.. సోమయాజులు ఒచ్చాడు. కాసేపు వుండి వెళ్ళిపోయాడు. బామ్మగారు చూసి రమ్మన్నారన్నాడు. మనిషి numb గా వున్నాడు. అక్క అంతా కలిసి వైజాగ్ వెళ్ళివచ్చారుట.

22-8-1986

కాస్త ఉల్లాసంగా వున్న రోజు.

టాల్ స్టాయిని చదువుతూ, ఆలోచిస్తూ. నిజానికి ఆయన్ని కూడా కాదు. స్త్రీపురుషుల మధ్య ఏ నిష్కపట నిసర్గ సౌభ్రాత్రం ఉండాలన్నాడో దానిగురించి. ఆయన ఒట్టి నీతిబోధకుడు అయివుంటే పుస్తకాన్ని విసిరేద్దును. but, he is sincere and artistic,.. అందుకే, ఎంతో హితంగా, సన్నిహితంగా చెప్తున్నాడు.

విజయకుమార్ కథ మీద అభిప్రాయం చెప్పాను. అతనికి vision ఉంది. అయితే, ఇంకా artfulness  రాలేదు. అది రావచ్చు, రాకపోవచ్చు, But even for that visionary themes- ఆ కథలు వెలుగు చూస్తే బావుణ్ణు.

23-8-1986

సాయంకాలం శరత్ ఇంట్లో మిత్రులంతా.

బాలసుబ్రహ్మణ్యం ‘అసంపూర్ణ మథనం’4 చదవడం complete చేసేసాడుట. అద్భుతంగా వుంది అన్నాడు. I felt very happy. దాని మీద work  చేస్తానన్నాను.

రాత్రి మూడో జాముదాకా.. మళ్ళీ నా గదిలో గోపీచంద్, బాలసుబ్రహ్మణ్యం.

24-8-1986

మధ్యాహ్నం మూడయింది ఇంటికి వచ్చేసరికి. నేను రావడం నిజంగానే మంచి పనయింది. ఇంట్లో అంతా బెంగపెట్టుకున్నారు. వాతావరణం కూడా అలానే వుంది. పేదగా, దిగులుగా..

నా రాక మళ్ళీ ఇంట్లో ఉత్సాహాన్ని పోసింది.

టాల్ స్టాయి గారు అట్లా నాకు ఏవేవో విశదపరుస్తూనే వున్న్నాడు. బాల్యం యవ్వనం, వృద్ధాప్యం-అన్నీ కలిసి ఆకట్టుకుంటున్నాయి ఆయన్లో. ఒక్కో కథ ఒక్కో విధంగా ఒక ద్వారం.

రాత్రి అద్భుతమైన వెన్నెట్లో-పూర్వ జ్ఞాపకాల అజ్ఞాత మోహనరాగాలు తీసిన డోలికల్లో వూగులాట.

25-8-1986

ఈ రోజు కూడా వుండిపోయాను.

మల్లు తిరపతినుంచి వచ్చాడు. పెళ్ళి విశేషాల్తో.

సాయంకాలం రిజర్వాయర్ కి తీసుకువెళ్ళాడు జీవన్. అదంతా గొప్ప ప్రశాంతకరమయిన అనుభవం. It looks like a sanctuary

 A sanctuary of troubled souls.

రాత్రి అడవిలోంచి మోపెడ్ మీద మొల్లిమెట్ల తీసుకువెళ్ళాడు. ర-మేష్టారి స్నేహితురాలి ఇంటికి. పెళ్ళి కాకుండానే తల్లిగా నిలబడిన ఆమె ధైర్యానికి నేను వినయపడ్డాను.

రాత్రి మిత్రుల్తో ఫిల్మ్ కి.

26-8-1986

నీచమైన గొడవ ఆఫీసులో.

మనం ఎక్కడ hurt  కావాలో అక్కడ కాకపోవడం, ఎక్కడ కాకూడదో అక్కడ అవడం. Being crushed తప్పించుకోవాలన్న కోరిక-చివరకి పనినుంచి తప్పించుకోవడంగా బయటపడుతోంది.

మధ్యాహ్నం మిత్రులు కలిసారు.

టాల్ స్టాయి కథలు పూర్తయింది చదవడం. ఒక కొత్త రచయితని discover చేసినట్టుగా వుంది. But, in fact, it is discovering myself in identification with that Count.

14-10-2022

_________________________

1 నిర్వికల్ప సంగీతం
2 1986 లో వచ్చిన వరదల్లో ధవిళేశ్వరంలో గురజాడ కళాసమితి సామగ్రి, తెరలు, డాక్యుమెంటరీ నాటకాలకు సమకూర్చుకున్న పరికరాలు మొత్తం కొట్టుకుపోయాయి. ఆ నష్టం టి.జె.రామనాథం ని మానసికంగా చాలా కుంగదీసింది.
3 బైరాగి వాక్యాలు
4 నేను రాసిన మొదటి నవల. అది చంద్రశేఖర ఆజాద్ అనే మిత్రుడు తీసుకువెళ్ళాక మళ్లా నేను తిరిగి తెచ్చుకోలేదు. ఇప్పుడు ఆ మిత్రుడు కూడా లేడు.

Leave a Reply

%d bloggers like this: