రాజమండ్రి డైరీ-3

18-1-1986

చివరినిమిషంలో సివిల్ సర్వీసెస్ కి ఎప్లికేషను పడేసాను. ఇంక దాని మీద hopes ఏమీ లేవు. అయినా last chance. Leaving only to chance. ఎందుకు కలిగిందో గాని deep resentment-అదే నన్ను అంత incapable చేసేసింది ఆ విషయంలో.

Safety theme మీద ఏదో ఒకటి drama frame చేసి వుండేవాణ్ణే గాని మ- అంతా చెదరగొట్టేసాడు. Non-technical ని నేను రాయగలనా అన్న సందేహంతో ఒక్క వాక్యం కూడా రాయలేకపోయాను. ప్రసాదమూర్తి disappoint కావడమే కాకుండా, irritate అవడం కూడా తెలుస్తోంది. కాని ఏం చెయ్యను?

రాత్రి శేషూ, గోపీ, తమ్ముడూ-అంతా కలిసి రామకృష్ణ ఇంట్లో హడావిడి. మధ్యలో రవీంద్రకుమార్ గారి ఇంటికి వెళ్ళి పలకరించాను. చాలా ఆనందపడ్డాడు. అతని ఇల్లు మరీ అందంగా, మరీ peaceful గా ఉంది. ఒక జుగల్ బందీ కేసెట్టు ప్రెజెంట్ చేసాడు.

రాత్రి టివిలో ఇన్నాళ్ళకు అపరాజితొ, సత్యజిత్ రాయ్. ఇదే చూడటం. కాని అద్భుతమైన సృజన. అతని గ్రేట్ నెస్ స్పష్టంగా తెలిసింది. చాలా ప్లెయిన్ గా, నిరాడంబరంగా తీసాడు. ఎటువంటి క్రుత్రిమత్వాలు లేకుండా. శ్యాం బెనిగల్ అయినా, బాపు అయినా ఎవరయినా అతనికి ఋణపడి వుండటమే కాదు, ఇంకా అతన్నుంచి చాలా నేర్చుకోవాల్సి వుంది. ముఖ్యంగా అతని vision లో ఉన్న clarity. అది బిభూతి భూషణ బెనర్జీగారి కథనంలోని గొప్పదనమో, సత్యజిత్ రాయ్ గొప్పదనమో చెప్పలేనట్టుగా ఉంది.

19-1-1986

శాస్త్రి ఆతిథ్యం. గోపీ, బాలసుబ్రహ్మణ్యం- సాయంకాలం దాకా గొప్ప ఉల్లాసంగా గడిచింది. ఉదయం ప్రసాద్ ని కలిసి శాస్త్రివాళ్ళింటికి వెళ్ళాను. కబుర్లు, భోజనాలు, సిగరెట్లు, టీలు, మధ్యలో శ్రీ శ్రీ, పాతసినిమాలు, కన్యాశుల్కం, మృచ్ఛకటికం, ఇంగ్లీషు మూవీలు-సాయంకాలం చిన్న పడవ మీద లంకలమీదకు పోయి కూచున్నాం. నీటిమీద సన్నగా వూగుతో సాగే పడవ, రివ్వున వీచే చలిగాలుల మధ్య, మందమందంగా నీళ్ళు చేసే చప్పుడు. బఠాణీలు-ఎంత ప్రశాంతంగానో అన్పించింది. ఏవేవో చర్చలు. మరాఠీ కథలు చదివాం. ఆ కథలమీంచి చిన్న కథమీద, దాని చరిత్ర మీద, భవిష్యత్తుమీద, కవులు,కవిత్వం, మనిషికోసం వెతుకులాట, మనుషులపట్ల contempt-అట్లా అట్లా గడిచిపోయింది కాలమంతా.

ఎట్లా గడిచిందంటే, ఇవాళ ఎందుకు నేను రాజమండ్రిలో ఆగిపోయేనో మర్చిపోయేను. ఆవిణ్ణి కలుద్దామన్న సంగతి ఆరింటికిగాని గుర్తురాలేదు. చిన్న నవ్వొచ్చింది. ఆవిడతో నా relation నాకే అర్థం కాని mystery అవుతోందా?.. వీళ్ళంతా ఎవరూ తాకలేని ఓ అమూల్యప్రాంతంలో ఆమె నన్ను తట్టిలేపింది. ఎంతయినా ఆమెని ఒదులుకోకూడదని..కాని నా చేతుల్లో ఏముంది? ఇంతా కలలు అల్లుకున్నాక- ఈ విగ్రహారాధన మంచిది కాదు అంటూ ఆమె సులభంగా విదిలించుకు వెళ్ళిపోగలదు.

రాత్రి మహేష్ ఇంట్లో మిత్రబృందంతో కబుర్లు. శరత్ మంచి spirits లో ఉన్నాడు. Well entertained. ఈ హడావిడిలోనే వేదిక గురించి ఏవో plans, ఏవో ideas.. proposals..

(ఆ తర్వాత జనవరి 30 దాకా ఎంట్రీలు లేవు)

31-1-1986

అనుక్షణికం పూర్తి చేసాను…

అక్కకి వుత్తరం రాసాను. ‘నువ్వు చాలా energetic person వి. నువ్వే ఇట్లా ఏకాకితనపు గుంజనాల్లో కూరుకుపోతే మాలాంటివాళ్ళం ఎట్లా?’ అంటో. ఆమె శక్తి పట్ల నాకు నమ్మకం వుంది.

మల్లు వూళ్ళోకి వచ్చి మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోయాడు. కలవలేదు. ఫోన్ చేసాడు. పెద్దవార్తలేమీ లేవు. అంతా కులాసానే అంటూ.

1-2-1986

ఊరు కదలకుండా సెలవు దినాన్ని వ్యయపరుస్తో గడిపాను. సాయంకాలం ఆజాద్ గారు రాలేదు. మెల్లని అలల్తో నది మాత్రం ప్రవహిస్తూ వుంది. సమాచారం ముప్పై ఏళ్ళ ఉత్సవం కోసం, సావనీర్ కోసం గోష్టి. Pressmen, ఇతరమిత్రులు. కాని ఎక్కువసేపు భమిడిపాటి రాధాకృష్న entertain చేసాడు. అతని కబుర్లలో మంచి హ్యూమర్ వుంది. ఆర్ద్రత ఉంది. గోపీతో కలిసి శాస్త్రి యింటికి వెళ్ళాను. కాసేపు కబుర్లు. అక్కణ్ణుంచి రామకృష్న ఇంటికి.క్రికెట్ కబుర్లు. రాత్రి యింటికి.

టాగూర్ విసర్జన్ చదివాను. అద్భుతమైన సృజన. టాగూర్ లోని myth making power ఏమిటో యిప్పుడు బాగా అర్థమవుతోంది. ఆయన్ని కవి అనాలా? వేదాంతి అనాలా? రుషి అనాలా? మనిషి అనాలా?…

( ఫిబ్రవరి 2 నుండి జూన్ 22 దాకా ఎంట్రీలు లేవు)

23-6-1986

ఉదయం రాజవొమ్మంగి నుంచి.

అక్కా, సోమయాజులు, బుజ్జితో. నెమ్మదిగా మళ్ళీ ఇక్కడి రొటీన్ లోకి. సాయంకాలం బాలసుబ్రహ్మణ్యం, రామకృష్న, విజకుమార్, సుబ్రహ్మణ్యం- మిత్రులంతా కలిసారు. రాజమండ్రి విశేషాలు చెప్తున్నారు.

మల్లాప్రగడ రామారావుగారు వైజాగ్ వెళ్ళిపోతున్నారు.

చాలా రచనలు వూహకి వస్తున్నాయి. పరిశ్రమించాలి.

(తిరిగి మళ్ళా జూన్ 30 దాకా ఎంట్రీల్లేవు)

14-10-2022

Leave a Reply

%d bloggers like this: