తేనీటి పుస్తకం

Reading Time: < 1 minute

ఆ మధ్య ఒకాకురొ కకుజో రాసిన ‘బుక్ ఆఫ్ టీ’ గురించి రాస్తూ నేను కూడా టీయిష్టుని కావాలనుకుంటున్నాను అని రాశాను. అది చదివిన వెంటనే నరుకుర్తి శ్రీధర్ గారు నాకు మెసేజ్ పంపారు. మీ ఇంటి అడ్రస్ పంపించండి అని. ఎందుకని అడిగాను. మీకు ఒక టీ ఇన్ఫ్యూజర్ పంపిద్దాం అనుకుంటున్నాను, ఒక్క నిమిషంలో టీ కాచుకోవచ్చు అని జవాబు ఇచ్చారు. నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు ఆయనే మళ్ళీ ఒక ప్రశ్నార్థకం పంపించారు. నేను కానుక తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను అన్నాను. ఎందుకు మీరే కదా మన మధ్య కానుకల ఎక్స్ఛేంజి మొదలు పెట్టింది అన్నారు. అవును, నేను ఒకసారి ఒక బొమ్మ గీస్తే అది ఆయనకు నచ్చిందంటే పంపించాను. దాంతో మరింకేమీ మాట్లాడక సరే అన్నాను. నాలుగు రోజుల్లో ఆ టీ ఇన్ఫ్యూజరు మా ఇంటికి వచ్చింది.

ఆ కానుకకి తిరిగి మరే కానుక పంపిద్దామా అని ఆలోచించాను. అసలు ఆ ‘బుక్ ఆఫ్ టీ’ నే తెలుగులో అనువాదం చేసి పంపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ పుస్తకం అనువాదం చేశాను. అనువాదం అయితే ఎప్పుడో అయిపోయింది కానీ ఆ పుస్తకం మధ్యలో ప్రతి అధ్యాయానికి ముందు ఏవైనా బొమ్మలు పెట్టాలనుకున్నప్పుడు ఏ బొమ్మలు పెడితే బాగుంటుంది అని ఆలోచించాను. జపనీస్ చిత్రలేఖనాలు పెడితే బాగుంటుంది అని నెట్ శోధించాను. అలాగే వికీ కామన్స్ లో ఇకేబాన (జపనీయ పుష్పాలంకరణ) బొమ్మలు కూడా వెతకాను. అవేవీ ఆ పుస్తకానికి సరిపోలేదు. అందుకని చెర్రీ పూల బొమ్మలు నీటి రంగుల్లో నేనే చిత్రించాను. ఇప్పటికి పుస్తకం పూర్తయింది.

ఇది శ్రీధర్ తో పాటు మీకందరికీ దసరా కానుకగా అందిస్తున్నాను. డౌన్ లోడ్ చేసుకుని కిండిల్ లో చదువుకోవచ్చు. మీ మిత్రులకి కూడా కానుకగా పంపవచ్చు. పుస్తకం నచ్చితే మీ అభిప్రాయం తెలపవచ్చు.

2 Replies to “తేనీటి పుస్తకం”

  1. మేము మీకు ఋణగ్రాహితులుగా మిగిలి పోతున్నాము Sir🙏

Leave a Reply

%d bloggers like this: