నీ క్రౌర్యం నిజంగా ఒక చక్కెర

ప్రేమికుల్ని చక్కెర లాగా వధించేవాడా!

నువ్వు వధించేదే నిజమైతే

నన్ను ఇప్పుడే ఈ క్షణమే మధురాతి మధురంగా వధించు.మృదువుగా మధురంగా వధించడం

అది నీకే చాతనైన కళ.

నీ కృపా వీక్షణాన్ని కోరుకునే వాళ్లని నువ్వొక్క వీక్షణంతో వధిస్తావు.రోజూ పొద్దున్నే

నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను.

ఎందుకంటే నువ్వు సాధారణంగా ప్రభాతవేళ్లలోనే వధిస్తావు.నీ క్రౌర్యం నిజంగా ఒక చక్కెర. 

నీ కృపాప్రవాహాన్ని అడ్డగించకు.

ఎందుకంటే చివరికి నువ్వు నన్ను వధించబోయేది నా గుమ్మం దగ్గరే కదా.ఉదరం లేకుండానే శ్వాసించగలిగే నువ్వు దుఃఖాన్ని దుఃఖంతో ఎండగట్టగలవు.   

ఊపిరి తీసేలోపే ఒక నిప్పు కణికలాగా వధిస్తావు.

ప్రతిక్షణం నువ్వు పరాజయాన్ని మాకొక కవచంగా ఇవ్వచూపుతున్నావు,

ఖడ్గం ఎప్పుడో వదిలి పెట్టేసావు, 

కవచంతోనే మమ్మల్ని వధిస్తున్నావు.  

19-9-2022

2 Replies to “నీ క్రౌర్యం నిజంగా ఒక చక్కెర”

Leave a Reply

%d bloggers like this: