ప్రకృతి మరీ విషయాలను కలగాపులగం చేసేయలేదు. నీ పరిమితుల్నీ, నీ హద్దుల్నీ నువ్వు గుర్తుపట్టవచ్చు. నీ శ్రేయస్సు, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకో.తక్కినవాళ్ళు తెలుసుకోవలసిన పనిలేకుండానే నువ్వు మంచిమనిషిగా ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండవచ్చు.
మరో మాట. నువ్వు గొప్ప శాస్త్రవేత్తవో, తత్త్వవేత్తవో కాలేకపోయినంతమాత్రాన నీ ఆశలు కూలిపోయినట్టుకాదు. నువ్వు స్వతంత్రుడివిగా జీవించే అవకాశం నీకెప్పటికీ ఉంది. వినయంగా మసలుకోడానికీ, ఇతరులకు సేవచేయడానికీ, భగవంతుణ్ణి అనుసరించడానికీ నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
మార్కస్ అరీలియస్, మెడిటేషన్స్, 7:67
15-9-2022