ఈ ప్రపంచం మంచికే

నీకు ఏమేమి జరిగినా అదంతా కూడా ఈ ప్రపంచం మంచికే. ఆ మంచి ఈ క్షణాన ఇక్కడ జరుగుతున్నదే. నువ్వు కొద్దిగా లోతుగా చూస్తే నీకు మరోసంగతి కూడా అర్థమవుతుంది. ఏ ఒక్క మనిషికి మంచి జరిగినా అది తక్కిన వాళ్ళందరి మంచికోసం కూడా.

మార్కస్ అరీలియస్, మెడిటేషన్స్, 6:45

~

ఈ వీడియో పోస్టు చేసినప్పుడు ఒక మిత్రుడు అడిగాడు, ‘ఒక మనిషికి మంచి జరిగితే అది ప్రపంచానికి మంచి ఎలా అవుతుందో అర్థం అవలేదు’ అని.

నేనన్నాను: ‘ఎందుకు కాదు? నేనొక నది ఒడ్డున నిల్చున్నాను. కొన్ని క్షణాల ప్రశాంతి పొందాను. దాన్నిప్పుడిలా నలుగురితో పంచుకోలేదా!’ అని.

మరొక మిత్రుడు అడిగాడు: ‘మనకు చెడు జరిగినా అది కూడా ప్రపంచానికి మంచి అవుతుందా..గురువుగారు’ అని.

నేనిలా జవాబిచ్చాను:’ఇక్కడ మంచి చెడులు సామాన్యార్థంలో కాదు. గాంధీజిని పీటర్ మారిష్ బర్గ్ రైల్వేస్టేషన్లో రైల్లోంచి కిందకు తోసేసారు. అది ఆయనకు జరిగిన చెడు. కానీ దానివల్ల ప్రపంచానికి ఎంత మంచి జరిగిందో మనకు తెలుసు ‘ అని.

15-9-2022

Leave a Reply

%d bloggers like this: