గద్వాల దాటేక

Reading Time: < 1 minute

గద్వాల దాటేక, 21-8-22

~

ఒక్క క్షణంలో నీ కళ్ళ ముందున్న దృశ్యాన్ని పట్టుకుని కాగితం మీదకు తీసుకురావడమే నిజమైన శిక్షణ. ఒక దృశ్యాన్ని ఫోటో తీసుకుని దాన్ని గంటల తరబడి స్టూడియోలో చిత్రలేఖనంగా మార్చడంలో చిత్రకారుడు కన్నా పనివాడే ఎక్కువ పని చేస్తుంటాడు. నువ్వు ఒక తృటిలో చూసిన దృశ్యాన్ని అంతే సత్వరంగా కాగితం మీద పెట్టవలసి వచ్చినప్పుడు నీలో నిజమైన ద్రష్ట బయటికి వస్తాడు. నువ్వు చూసిందానిలో నీ దృష్టిలో ఏది నిజంగా ముఖ్యమో, ప్రధానమో అది మాత్రమే బొమ్మగా మిగిలి, తక్కిందంతా పక్కకు తప్పుకుపోతుంది.

ఇదే ఈ శిక్షణ కోసమే ఇప్పుడు నేను ఎదురు చూస్తూ ఉన్నాను.

ఈరోజు రైల్లో కర్నూలు వెళుతుండగా ఎదురుగా మబ్బు పట్టిన విశాలాకాశం, కింద అప్పుడప్పుడే చిగుర్లు తొడుగుతున్న పత్తిచేలు, వాటి మధ్య ఒక ఒంటరి చెట్టు. గద్వాల దాటాక చూసిన ఈ దృశ్యాన్ని ఒక్క క్షణంలో స్కెచ్ గా గీసాక, ఈ అనుభవం మరిన్ని ప్రయాణాల కోసం నన్ను ఎదురుచూసేలా చేస్తోంది.

21-8-2022

Leave a Reply

%d bloggers like this: