శివకుమార శర్మ

Reading Time: < 1 minute
అతడు కొండమీంచి ఏ రాగాలో మనమధ్యకు తీసుకొచ్చాడు
కింద అతడి మిత్రులు లోయలో పూసిన పూలు పట్టుకొచ్చారు.
 
వాళ్ళని మనం కలవకపోయి ఉంటే ఏమయ్యుండేది?
బహుశా ఏమీ కాకపోయి ఉండేది.
 
అటువంటి రాగాలు ఉండేవని తెలిసిఉండేది కాదు,
ఆ రంగులు చూసి ఉండేవాళ్ళం కాము.
 
ఆ రంగుల్ని చూసేం, ఆ రాగాలు విన్నాం
అయితే మాత్రం ఏమి జరిగింది?
 
మనమెక్కడో శుభ్రపడ్డాం, తేటపడ్డాం.
లేకపోయుంటే బహుశా నేనీ కవిత రాసి ఉండేవాణ్ణి కాను.
 
12-5-2022

Leave a Reply

%d bloggers like this: