కరదీపిక

ప్రాచీన భారతీయ కవిత్వానికి ఇంగ్లిషులో వచ్చిన అనువాదసంకలనాలు చాలానే ఉన్నాయి. వాటిలో నాకు నచ్చిన కొన్ని సంకలనాల్లో సచ్చిదానందన్ అజ్ఞేయ, విద్యానివాస్ మీర్థా వెలువరించిన The Indian Poetic Tradition: An Anthology of Poetry from the Vedic Period to the Seventeenth Century (1983) ఒకటి. సంస్కృతం, పాళీ లతో పాటు, ప్రాకృతం, అపభ్రంశ భాషలనుంచి ఏరి కూర్చిన కావ్యఖండికల ఇంగ్లీషు అనువాదాల సంకలనం ఇది. ఇది ఒక సంకలనంగానూ అత్యుత్తమమైనది, అనువాదంగానూ మరింత మేలిమి అనువాదం.
 
ప్రాచిన, మధ్యయుగాల భారతీయ కవిత్వం గురించిన ప్రాథమిక పరిచయం కావాలనుకునే ఏ సాహిత్య విద్యార్థికైనా ఇది ఒక కరదీపిక. సముద్రమంత సంస్కృత సాహిత్యం నుంచి సంకలనకర్తలు చేసిన ఎంపిక దానికదే ఒక పరిచయం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలతో పాటు కావ్యాలు, నాటకాలు, ముక్తకాలు, శతకాలనుంచి కూడా చాలా చక్కటి ఖండికలని ఎంపికచేసారు. వాటితో పాటు అంతగా సుప్రసిద్ధులు కాని కవులు, కాని పాశ్చాత్య పాఠకులకి ప్రీతిపాత్రులైన కవులు, విద్య, విజ్జిక, వికటనితంబ వంటివారి కవితలు కూడా ఉన్నాయి.
 
ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు వంటి ఆలంకారికులు తమ లక్షణ గ్రంథాల్లో ఉదాహరణకోసం రాసిన శ్లోకాలని కూడా ఎంపిక చేయడం విశేషం.
 
ఇక థేరగాథలతో పాటు సుత్తపిటకం నుంచి ఎంపికచేసిన పాళీ రచనలతో పాటు, గాథాసప్తశతి, వజ్జాలగ్గం వంటి ప్రాకృత సంకలనాలనుంచి కూడా మేలిమి పద్యాలున్నాయి. ప్రవరసేనుడు, వాక్పతిరాజుల కావ్యాలనుంచి పద్యాలు ఎలానూ ఉండక తప్పదు కదా. ఇక ఈ సంకలనానికి మేలిమి తురాయి, అపభ్రంశ సాహిత్యం నుంచి ఎంపిక చేసిన పద్యాలు. వాటిలో చర్యాపదాలనుంచి కూడా నాలుగు పద్యాలున్నాయి.
 
తమ సంకలనానికి సంకలనకర్తలు రాసుకున్న ముందుమాట చాలా విలువైంది. ప్రాచీన మధ్యయుగాల భారతీయ జీవితదృక్పథం, సౌందర్య దృక్పథం ఎటువంటివో, ఏ దృక్కోణంలోంచి ప్రాచీన సాహిత్యాన్ని సమీపించాలో ఆ ముందుమాట దారిచూపిస్తుంది.
 
వీటన్నిటితో పాటు నాకు చాలా బాగా నచ్చింది ఆ అనువాదాలు. మామూలుగా సంస్కృతానికి ఇంగ్లిషు అనువాదాలు చాలా పేలవంగా ఉంటాయి. ఆ అనువాదాన్ని చదివి మూల కృతి సౌందర్యాన్ని గుర్తుపట్టడం ఏమంత సులభసాధ్యం కాదు. కాని అజ్ఞేయ స్వయంగా కవి కావడంతో ప్రతి అనువాదాన్నీ ఎంతో సరళసుందరంగా తీర్చి దిద్దాడు. ఈ పనిలో నాథన్ లియొనార్డ్ అనే అమెరికన్ కవి, పండితుడు అనువాదకులకి తోడ్పడ్డాడు.
 
ఆ అనువాద ప్రతిభను చూపించడానికి ఒకటి రెండు ఉదాహరణలు:
 
మొదటిది, ఋగ్వేదంలో అరణ్యాని సూక్తం. ఈ సూక్తం అరణ్యాన్ని ఒక దేవతగా భావిస్తూ ఆమె స్వరూప, స్వభావ, సాన్నిధ్యాల్ని ప్రస్తుతించే అపురూపమైన కవిత. అడవి ఆవహించిన అనుభవాన్ని వర్ణించే ‘వనవాసి’ నవల మీలో చాలామంది చదివే ఉంటారు. ఆ నవల అసలు పేరు ‘ఆరణ్యక’. ఆ నవలకు ముందుమాట రాస్తూ ప్రఖ్యాత విద్వాంసుడు సునీతి కుమారి ఛటర్జీ, ఈ సూక్తం తాలూకు స్ఫూర్తి ఆ నవల పొడుగునా పరుచుకుని ఉందని చెప్తాడు.
 
1
 
ARANYANI: FOREST SPIRIT
 
Aranyani, Aranyani, always shifting back and back
Why do You turn away from the village? It couldn’t be fear.
When distant cattle begin to low and the cricket responds,
It is as though Aranyani laughed far off among bells.
 
Was it She once glimpsed out there, or a shimmer of cows or some house?
She can shape from the dusk a secret movement of carts.
Her voice is like someone calling the herds, like a falling tree
As it rends, or to those in the woods after the dark, the remotest wail.
 
She will not hurt unless someone unkind comes close.
Her food is the fruit in there and she moves or rests where she will.
Sweet with the scent of the dark, served without tilling the ground
Mother of all wild things, now, I have sung you, Aranyani.
 
రెండవది, భారతంలో స్తీపర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చేసిన బోధ.
 
2
 
AGANIST GRIEVING
 
All Savings add to loss, all flights to falls
All meetings to divorces, lives to deaths.
 
In peace men die, the soldier lives in death
No one can cross the sweeping line that death draws.
 
Men blossom out of nothing, then sink back.
The order, once for all, is set. Why wail?
 
You get no closer to your dear one or
To death by crying. Things never change for tears.
 
Death includes it all, all castes, all kinds.
He is no man’s enemy and no man’s friend.
 
Wind can flatten grass from any side
Death can flatten everything at will.
 
All living things are heading to one end
If one gets there ahead, is this a grief?
 
Death is the cook. He wipes out all those born.
He watches over sleep. No one gets by him.
 
Youth, beauty, force, riches, health and friends
For what will perish sages have no love.
 
This is not yours alone. All men partake
In suffering that comes as it must come.
 
What a man did will sleep with him, and rise
With him and chase him when he runs ahead.
 
రామాయణం నుంచి ఎంపిక చేసిన ఖండికల్లో నన్ను ఆశ్చర్యపరిచింది అయోధ్యావర్ణన. రాముణ్ణి అడవిలో కలిసి వచ్చిన తర్వాత, అయోధ్యలో అడుగుపెట్టబోతున్న భరతుడికి అయోధ్య కనిపించిన దృశ్యం తాలూకు వర్ణన అది. బహుశా దాన్ని చదివినప్పుడు పాశ్చాత్య పాఠకులకి విధ్వస్త ట్రాయి నగరం గుర్తురావడంలో ఆశ్చర్యం లేదు.
 
3
 
CITY IN MOURNING
 
Ayodhya, great city, seems
Like the night itself, in the pitch of dark
Where only cats are awake and owls,
Where men and monkeys keep to cover.
 
It looks like a river drying up
So that its shallows heat too soon
And waterfowl must surface, fish
And crocodiles restlessly stir.
 
It looks like a ruined army, warriors
Fallen everywhere, armour
Broken, elephants fallen, horses
And chariots fallen, banners thrown down.
 
It looks like the tide at the ebb, brushed back
By a calm breeze, utterly quiet
After its hour or foam and roar,
After its highest lifting wave.
 
It looks like an altar given up
After the Soma has been pressed
The sacrificial implements
Left here and there, the priests all gone.
 
It looks like a cow come into heat
But lacking the service of a bull
And standing, desolate, in the pen
Refusing the offered new cut grass.
 
It looks like a necklace with the stones
That made it precious all removed
Stones whose lustre glittered out
Perfectly round, the rarest kind.
 
 
It looks like a drunken party all
the drinkers departed, having left
Behind their refuse, a carpeting
Of broken cups, voided of wine.
 
ప్రాకృతం, అపభ్రంశాలనుంచి రెండు మూడు ఖండికలు, తెలుగులో.
మొదటిది, సుప్రసిద్ధ ‘గౌడవహో ‘ కావ్యం నుంచి
 
ఉషస్సు
 
ప్రభాతవేళ చెట్లు బంగారంగా మారతాయి.
పచ్చటి పండ్లు పసిడిగా పండుతాయి.
 
ఈ మాటలు వినగానే Nature’s first green is gold అనే రాబర్ట్ ఫ్రాస్ట్ వాక్యం గుర్తురాకుండా ఎలా ఉంటుంది?
 
రెండవది, ఒక, అజ్ఞాత అపభ్రంశ కవి చెప్పిన శ్లోకం.
 
తెల్లవారిపోతుంది
 
కాని, ప్రియా, మరీ ఎక్కువసేపు అలకపూనకు, అకస్మాత్తుగా
రాత్రి అదృశ్యమైపోతుంది, ఇంతలోనే తెల్లవారిపోతుంది!
 
13-8-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading