
ఒక మిత్రురాలు ఈ మధ్య డేనియల్ స్మిత్ నీటి రంగులు నాకు కానుక చేసింది. నేడు ప్రపంచంలో గొప్ప నీటి రంగుల చిత్రలేఖ కుల్లో ఒకడైన ఆల్వార్ కాస్టాగ్నెట్ నెట్ వాడే కలర్ పాలెట్ అది. ఆ రంగులు నాకు కానుక చేసిన ఆ మిత్రురాలు ఒక ఉపాధ్యాయిని కూడా. ఆ రంగులతో గీసిన ఈ మొదటి చిత్రాన్ని మరొక ఉపాధ్యాయులకే కానుక చేయాలనిపించింది. ఎందరో ఉపాధ్యాయులు, అందరికీ నా వందనాలు. కానీ వారందరిలోనూ కూడా నేను ముందు తలవవలసింది మా చిన్నప్పటి ఆర్ట్ మాస్టారు. నన్ను కన్న బిడ్డ కన్నా అధికంగా ప్రేమించిన మా చిన్నప్పటి ఆర్ట్ మాస్టారు శ్రీ వారణాసి రామ్మూర్తి గారి స్మృతికి ఈ చిత్రలేఖనం కానుక చేస్తున్నాను.
5-9-2020