డాక్ ఘర్

కొన్ని పుస్తకాలు కాలంతో పాటు మళ్ళా కొత్తగా బతుకుతాయి. కొత్త అర్థాలు సంతరించుకుంటాయి. టాగోర్ రాసిన ‘డాక్ ఘర్ ‘ అట్లాంటి నాటిక.

నా చిన్నప్పుడు ఈ పుస్తకం నన్నెంత ఆకట్టుకుందో చెప్పలేను. ఆ పుస్తకంలో ఉండే అమల్ లోనే నన్ను చూసుకునే వాణ్ణి. బహుశా టాగోర్ తననొక పసిపిల్లవాడిగా భావించుకుని ఆ నాటిక రాసుకుని ఉంటాడు. కాని, ఆ కథ ఒక మెటఫర్ గా మారి ఐరోపీయ రచయితల్ని గాఢంగా ప్రభావితం చేసిందని సుశ్రిత అనే ఒక పరిశోధకురాలు రాసిన వ్యాసం చదివితేనే అర్థమయింది.

https://scroll.in/…/what-rabindranath-tagores-1912-play…

రెండవ ప్రపంచ యుద్ధంలో గాస్ ఛాంబర్లలో దగ్ధమైపోయేముందు యూదుపిల్లల్తో ఒక పోలిష్ ప్రయోక్త దాన్నొక రూపకంగా మార్చి ప్రదర్శించాడనీ, అలాగే మరొక స్విస్ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులైన పిల్లల్తో మరొక రచయిత దాన్ని మరొక ప్రయోగంగా ప్రదర్శించిందనీ. కాని ఆ పరిశోధకురాలు ఈ క్వారంటైన్ సమయంలో ఆ నాటిక గుర్తుకు తెచ్చి నా మనసుని చెప్పలేనంతగా మెత్తపరిచింది. టాగోర్ 1912 లో రాసిన ఆ నాటిక వందేళ్ళ తరువాత ఎంత కొత్త అర్థాన్ని సంతరించుకుంది!

ఆమె రాసిన వ్యాసం చదవగానే నాకు అమాంతం ఆ నాటిక మొత్తం మీకు వినిపించాలనే ఉత్సాహం కలిగింది. ఇదిగో, వినండి, అబ్బూరి రామకృష్ణారావుగారి తెలుగు సేతలో.

నిజానికి ఈ నాటకం పిల్లలు ప్రదర్శించవలసిన నాటకం. అయినా నా ఉత్సాహం ఆపుకోలేక అన్ని పాత్రలూ నేనే అయి, ఇదిగో, నా గొంతులో, ఒక్క గంట నిడివిన, ఇట్లా మీ కోసం.

22-6-2020

Leave a Reply

%d