కుసుమకళిక

పుష్కిన్ మాటల్లో ఏదో మహిమ ఉంది. శతాబ్దాల తరబడి రష్యన్ పాఠకుల్నే కాదు, సుదూర సముద్రాలకి ఆవల ఉన్న నాలాంటి పాఠకుల్ని కూడా అయస్కాంతంలాగా పట్టిలాగుతున్నది.

The Floweret (1848) అనే ఈ చిన్న కవిత చదవగానే ఇట్లా ఒక ముత్యాలసరంగా మార్చకుండా ఉండలేకపోయాను.

~

కుసుమకళిక

వన్నె తరిగిన చిన్నెలుడిగిన
కుసుమకళికను, కంటినేనొక,
పాతపొత్తము పుటలమధ్యన,
వింతతలపులు రేగగా.

విరిసెనెప్పుడు? మురిసెనెవ్వరు?
తుంచెనెవ్వరు?ఉంచెనెవ్వరు?
బంధుజనులా? బయటివారా?
ఏ మధూదయ వేళలన్?

కలసి గడపిన కూర్మి దినముల
వలపు గురుతా, వీడుకోలా?
నీడపట్టుల నడచినప్పటి
నిర్వేదజ్ఞాపికనా ?

ఆతడెక్కడ? ఆమె ఎక్కడ?
ఉన్నదా ఆ ప్రణయబంధము?
లేక ఈ పూరేక మాదిరి
వడలిసడలినదా?

THE FLOWERET. (IV. 95.)

A floweret, withered, odorless
In a book forgot I find;
And already strange reflection
Cometh into my mind.

Bloomed, where? when? In what spring?
And how long ago? And plucked by whom?
Was it by a strange hand? Was it by a dear hand?
And wherefore left thus here?

Was it in memory of a tender meeting?
Was it in memory of a fated parting?
Was it in memory of a lonely walk?
In the peaceful fields or in the shady woods?

Lives he still? Lives she still?
And where their nook this very day?
Or are they too withered
Like unto this unknown floweret?

20-5-2019

Leave a Reply

%d bloggers like this: