
1985-2000 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన వివిధ సాహిత్య ప్రశంసాత్మక వ్యాసాల నుంచి ఏరి కూర్చిన వ్యాసాల సంపుటి. ఇందులో సమీక్షలు, ముందుమాటలు, ప్రసంగపాఠాలు, ఉత్తరాలు, వివిధ సాహిత్యమూర్తుల జీవనరేఖా చిత్రణలు ఉన్నాయి. ఈ రచన వెలువరించిన తరువాత, తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్యవిమర్శ రంగంలో, కీర్తిపురస్కారంతో రచయితని సత్కరించింది.
అదే పుస్తకం.నవ్యకాంతులను సరికొత్తగా మోసు కొచ్చింది.దేశ విదేశాలకు నిమిషాల్లో చేరుతుంది.సుగంధ సౌరభాలు వేదజల్లుతుంది.మరోసారి శుభాభినందనలు.రచయిత, చిత్రకారుడు ఒక్కడే కానీ వ్యక్తిత్వాలు రెండుగా కనికట్టు చేస్తాయి.
మీరు ఏదైనా పుస్తకం గురించో సినిమా గురించో వ్రాస్తే, అది నిముషాల్లో చూడాలి అనిపిస్తుంది 🙏