21 వ శతాబ్దంలో విద్య స్వరూప స్వభావాలు మారుతున్న వేళ, కొత్త శతాబ్దం మొదలుకాగానే, విద్యార్థులకి విద్యాలక్ష్యాల గురించి తెలియచెప్పే ఉద్దేశ్యంతో వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరించిన మూడు చిన్నపుస్తకాలు ‘మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?’, మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి?’, ‘మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి? విద్య గురించిన ఇటువంటి పుస్తకాలు తెలుగు బాలసాహిత్యంలో వెలువడటం ఇదే మొదటిసారి. ఈ రచనలకు ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ బి.ఏ.రెడ్డిగారు నడుపుతున్న సంస్కృతి గ్రామీణ బాలల కళాకేంద్రానికి చెందిన చిన్నారులు చిత్రలేఖనాలు సమకూర్చారు. 2005 లో వెలువరించిన ఈ పుస్తకాలకు ఉత్తమబాలసాహిత్యానికి ఇచ్చే డా.నన్నపనేని మంగాదేవి పురస్కారం లభించింది.
ఈ పుస్తకం సాఫ్ట్ ప్రతి చదవాలనుకున్నవారు ఈ లింక్ తెరిచి చూడండి:
miru badi nunchi emi nerchukovali