వాడ్రేవు చినవీరభద్రుడు జిలా గిరిజన సంక్షేమాధికారిగా 1987 నుంచి 1995 దాకా విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలు, అదిలాబాదుజిల్లాల్లో పనిచేసిన కాలంలో ప్రాథమికవిద్యను గిరిజనప్రాంతాల్లో సార్వత్రీకరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. 1995 నుంచి 1997 మధ్యకాలంలో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆ ప్రయత్నాలకొక సమగ్రరూపాన్ని సంతరించి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ అనుభవాల్లో ఆయన సాఫల్యవైఫల్యాలను వివరించే రచన ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు.’
ఈ పుస్తకం ఒక విధంగా గత శతాబ్దపు చివరి దశకాల్లోని ప్రాథమిక విద్య తీరుతెన్నుల చరిత్ర కూడా. ప్రభుత్వం చేపట్టే విద్యాకార్యక్రమాల గురించిన క్షేత్రస్థాయి అనుభవాలతో వెలువడిన ఇటువంటి రచన భారతీయ సాహిత్యంలో మరొకటి లేదు అని విద్యావేత్తలు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందచేసింది.
ప్రస్తుతం ఈ రచన ముద్రణలో లేదు.