మోహనరాగం:కుమారసంభవం

Kamadahanam-by-Lord-Shiva

కాళిదాసు కావ్యాల్లో సర్వోత్కృష్టమైన కుమారసంభవం గురించి వరల్డ్ స్పేస్ రేడియో కోసం’మోహనరాగం’ పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.

11 Replies to “మోహనరాగం:కుమారసంభవం”

  1. What a spell bounding speech! ఏంటి సార్ యిది!

    ఎప్పుడో బేచిలర్ గా ఉన్న రోజుల్లో జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం “Freedom from the Known” లో చర్చించిన ప్రేమ, శృంగారం, పెళ్ళి తదితర విషయాలను తిరిగి ఒక్కపెట్టున గుర్తు తెప్పించారు. Sex/Love is the most helpless question a human encounters అని అప్పట్లో నా నోట్స్ లో వ్రాసుకున్న inference. స్త్రీపురుషుల మధ్య ప్రేమ – Exploitation, however subtle it is; అని ఓషో చెప్తాడు. జిడ్డు కృష్ణమూర్తి, ఓషో – ముముక్షువులు, లేదా నిర్వాణం చెంది, తమతో తాము అనుక్షణం రమింపగలిగిన
    రస సిద్ధులు. వీరు శృంగార అవసరాన్ని దాటి ఉండవచ్చు. సాధారణ మానవులపరంగా ఈ శృంగారం అంటే ఏమిటి? అన్నది కవులు చర్చించినట్టు; కాళిదాసు కుమారసంభవంలో తాత్విక సారమే కామం దహింపబడి, రతి కొనసాగినట్టు మీరు వివరించడం నిశ్చేష్టపడేలా ఉంది. Why do we make everything a problem? What ever we touch becomes a problem, Why sex is a problem? అన్న తాత్వికుడు (జిడ్డు కృష్ణమూర్తి) కాళిదాసుకు సమస్యనిస్తే ఆయన సమాధానం వెతకడానికి చేసిన ప్రయత్నం లా ఉంది మీ వివరణ.

    నాకు కాళిదాసు అర్థం కాలేదు కానీ పెద్దన మాత్రం – రజోగుణం సత్వ గుణంగా పరిణమించడాన్నే “స్వారోచిష మనుసంభవం” గా మలిచాడని అనిపించింది. (ఆ మేరకు ప్రబంధరాగలహరి అని ఓ వ్యాసం వ్రాసుకొన్నాను). రజోజుషి జన్మని – జన్మయందు రజోగుణము, సత్వవృత్తయే స్థితౌ – స్థితి యందు సత్వ వృత్తి అని కదండీ కాదంబరి కారుడు. రజస్సు నుండి సత్వము వైపు – కేవలం పుట్టుక నుంచి – స్థిరత వైపుగా సాగిన పయనమే స్వారోచిష మనుసంభవమా?

    మీ వ్యాసం ముందుగా చూసి ఉంటే, కాదంబరిని కానీ, కర్పూరమంజరిని కానీ స్వారోచిషమనుసంభవాన్ని కానీ కొత్తగా చదువుకొని ఉండే అవకాశం ఉండేదేమో. మళ్ళీ చదువుకోవాలి. ఇంకో సారి జిడ్డు కృష్ణమూర్తి Freedom from the known కు కూడా వెళ్ళాలి.

    ధన్యవాదాలు.

    1. చాలా సంతోషం. మీ వంటి రత్నపరీక్షకుడి పరీక్షకు నిలబడినందుకు. కానీ, ఆ ప్రసంగంలో గుణాలన్నీ మా మాష్టారికి చెందుతాయి, దోషాలన్నీ నావి.

  2. చాలా చక్కగా వివరించారు.నేను హర హర మహాదేవ హిందీ సీరియల్ లో కుమార సంభవం మీరు చెప్పిన భూమికలో చిత్రిపబడటం చూసి ఇలాంటి భావాలనే గ్రహించాను.స్త్రీ,పురుష శక్తుల ఉన్నత తలాల కలయిక రెండు శక్తి రూపాలా కలయిక.అది ఒక తేజో రూపాన్ని సృష్టిస్తుంది.దానినిన్ మరల శరీర రూపంలోకి కృత్తికలు తీసుకొని వస్తారు.అంటే శక్తిని పదారడం గా మార్చడం మనం ఆ భూమిక లోకి వెళ్ళినపుడు సాధ్యం.కానీ ఓషో ఇది సరిగా మనుష్య లోకానికి అందించలేకపోయాడు.కానీ ఆ ఆలోచన అనేది ఒకటి ఉంది అనే విత్తనం వేయగలిగాడు.కాళిదాసు గారు వ్రాసినది చాలా సత్యం,ప్రేమ లోకి వెళ్లగలిగిన ఆ దైవ రూపాలు మాత్రమే కుమారుడు ను తమకు మారురూపంగా పొందగలరు.ఇలాటి పదాల విచక్షణ నేటి యువతకు వివరించాల్సి ఉంది.

  3. సాహితీమూర్తికి వందనం.
    చాలా లోతైన పరిశీలన,విశ్లేషణ.కామం,శృంగారానికి మధ్యన తేడాను శ్రీ కే.విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమాలో స్పష్టన్గా చూడవచ్చును.అయిష్టం గా నున్న దేవదాసీ కుటుంబము లోని మంజుభార్గవి (పాత్రల పేర్లు జ్ఞప్తికి లేవు,క్షమించండి.)దగ్గరకు ఒక విటుడు వచ్చి బలాత్కారం చేయడాన్ని కామం తో కూడుకున్న చర్యగా ,
    అన్నవరం సత్యనారాయణ గుడిలో ప్రసాదం కౌంటర్ వద్ద,గుడిమెట్ల వద్ద చంద్రమోహన్ ,రాజ్యలక్ష్మి పాత్రల మధ్యన చిత్రీకరించిన
    సన్నివేశాలు చక్కటి,చిక్కటి శృంగారానికి సంకేతాలుగా గుర్తించవచ్చు.
    ఇక రతి అనే పదానికి సామాన్యార్థంలో కాకుండా విశేషార్థంలో మీ విశ్లేషణ అద్భుతం.
    దంపతుల మధ్య జరిగే పవిత్రకార్యం ,అత్యున్నత స్థాయి భావం ‘రతి’ నిరంతరం ఆ ఇరువురి మధ్య నిరంతరం జరిగే మధురానుభూతి. అది గ్రహించవలసిందే కాని చెప్పడం కొంత కష్టం.
    శ్రీ పర్చూరి గోపాలకృష్ణ గారు వారి వ్యక్తిగత జీవితం లోని ఒక సంఘటనను ఏదో ఒక సందర్భంలో చెప్పినట్టు జ్ఞాపకం.
    వారి సతీమణి వారి గృహం లో ఎప్పుడు కూరగాయలు తరగాల్సివచ్చినా వంట గదిలో కాకుండా అయన కనిపించేటట్టుగా కూర్చొని ఆమాట ,ఈ మాట చెబుతూ మెల్ల మెల్లగా తరుగుతూ ఉండేదట.ఎక్కడో వంట గదిలో కూర్చొని తరగవచ్చును కదా,అలాగే అయన ఎదురుగానే కూర్చొని పని చేసుకోవడంలోని విశేషమేమిటి,
    ఆ మధురమైన అనుభూతికి ఇచ్చే నిర్వచనమే అనుక్షణం జరిగే హృదయసంబంధిత రతీభావం.
    ఇలా ప్రతి గృహం లోను జరుగుతూనే ఉంటుంది.అనుభూతి పోందడంలోఉంటుంది.గ్రహిచే మనిషి మనసులో జరిగే ఒక హృదయరంజకమైన రసానుభూతియే రతి.
    మీ వివరణతో కామానికి ,మొహానికి,ప్రేమకు మధ్యన ఉన్న ఆ సన్నని గీతలేవో అందరికి స్పష్టమయ్యేలా ……
    కాళిదాసును విశ్లేషిస్తూ ,వాల్మీకిని స్మరిస్తూ
    మీ గురువుగారిని హృదయకమలములో నిలుపుకొని చేసిన ప్రసంగధార
    అందరి మనస్సులను పరిశుద్ధం చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు sir.
    ధన్యవాదాలు sir

  4. భద్రుడుగారు “కుమారసంభవం” మీ ప్రసంగ జడి వానలో ఇప్పుడే తడిసి నిశ్చేష్టనయిన నేను ఇప్పుడే తేరుకున్నాను.

    మానవ జీవితంలోని అతిముఖ్య మయిన, మధురమైన , శాశ్వత అంశాలు-కామం,మేూహం,శృంగారం,
    ప్రేమ, దాంపత్యం సున్నిత తాత్విక పార్శ్వాన్ని కవి కాళిదాసు కావ్యాలు నాటికల లోని మూలాంశంగా కావ్య నాయక నాయికలు వాటిని పండించుకున్న తీరు సందర్భాలు వివరించిన ప్రసంగం అద్భుత రసానందానిచ్చింది.
    ముఖ్యంగా “కుమార సంభవం” లో శివ శక్తులు కాముని ధహనంతో దివ్య రతి శృంగారాలు పండించుకుని దివ్యకుమారుని ( కుమార స్వామి) జననం.

    అంటే ఆ అర్థనారీశ్వరుల దివ్య జీవిత విదానంతో మానవులు దివ్యత్వాన్నిపుణికిపుచ్చుకోవాలన్నది కాళిదాసు కవి ఉద్దేశంగా వివరించిన తీరు అద్భుతం.
    మానవులు మృగత్వాన్ని వీడాలనే గొప్ప నీతి నందించిన కావ్యం .

    ఆ అంశాల పై మానవునిలో కనుమరుగయిన ఆ సున్నిత తాత్విక ఆలోచనలను తిరిగి రచనల, కళ, చలనచిత్రాల ద్వారా ఆవిష్కరించ వలసిన అవసరాన్ని గుర్తించడం భద్రుడు గారి ప్రసంగంలో ఒక మంచి సూచన ,మెసేజ్.

    ఇప్పటి సమాజంలో ఆ అంశాలపై చలంగారి ఆలోచనల , రచనల విశదీకరణ బాగుంది..,
    simply marvelous .

  5. ఈ అద్బుత పరిచయం, వివరణ విని జ్ఞాన చక్షువులు తెరుచుకున్నాయి.

  6. వీరభద్రుడు గారు నమస్తే ఈ ప్రసంగం విన్నాక ఆ అనుభూతిని అనుభవిస్తూ దాని తాలూకు ఆలోచనలలో తడిసి ముద్దాయి పోయాను . చాలా ఏళ్ళ క్రితం ఎక్కడో మన భారతీయ సాహిత్యంలో కాళిదాసు , రవీంద్రనాధ టాగూరు వీళ్ళిద్దరే గొప్పరయితలు అని చదివాను . కాళిదాసు రచనలు అంటే నాకు ఎంతో ఇష్టం మీరు ఎంత బాగా,ఇంత అద్భుతంగా కుమార సంభవం అంటే ఏమిటి దాని అర్థాన్ని ఇంత బాగా వివరించి రతికి శృంగారానికి మధ్య చాలా సున్నితమైన భేదాన్ని చాలా సున్నితంగామీరు విడమరిచి చెప్పారు మీకు ధన్యవాదాలు తప్ప వేరే ఏమి చెప్పగలను

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading