‘పవన పులకిత చంద్రాతప ప్రఫుల్ల చారుశారద యామినీ సమయమందు వీథివీథుల మధురలో వెదకి వెదకి చేరుకుంటిని బృందావిహారు నిన్ను’ అంటారు వేదుల. కవిత్వంలో శరత్కాల చంద్రికల వెలుగు గురించి వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం’మోహనరాగం’ పేరిట 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: శరదృతువు
Reading Time: < 1 minute
వాల్మీకి సుందరకాండలోని హనుమంతుని చంద్రుని తో పోల్చడం… Means వెండి మబ్బుల్లోంచి ఒకసారి కనపడి,ఒకసారి కనపడక..
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న శరదృతువు…
ఇది వింటుంటే ఇప్పుడే ..శరత్ వెన్నెలలో .. ..మనసు ఊయల లూగుతుంది..అద్భుతమైన వ్యాఖ్యానం…
Thank you very much.
నన్ను, నాకంటి చూపు చివరి కొన వరుకు కురిసి, తడిపి పోయింది మీ మోహనరాగం శరత్ వెన్నెల చినుకులు . ధన్యవాదాలు చెప్పడం చిన్నదై పోతుందేమో.చాలా బుణపడిపోయాము మీకు.😊
ఎంతో కష్టపడి తెలుసుకొన్న తెలిసిన ఙ్ఞాన సంపదను ఏ ఒకరికి పంచను, నేర్పను అనే స్వార్దపూరితమైన ఇప్పటి కాలం లో మీరు నిజంగా మా ముంగిట కురిసే వెన్నెలే.-^-
అద్భుతం గా చెప్పారు. అనేక ధన్యవాదాలు గురువు గారూ. నమోనమహ