కబీరు-11

Reading Time: < 1 minute

A3

కబీరు ‘నాది దుఃఖం లేని దేశం’ ఇప్పుడే సాయిచరణాలదగ్గర సమర్పించి వచ్చాను.

తన మతం కబీరని విస్పష్టంగా చెప్పినవాడు. నిజమైన సూఫీ. అవధూత. ఆయన పాదాలదగ్గర ఆ పుస్తకం ఆవిష్కరణ కావటం నా భాగ్యం. ఈ పుస్తకం మా హీరాలాల్ మాష్టారికి అంకితమిచ్చాను.

పుస్తకం నుంచి ఒక కవిత:

ఫకీరూ, నువ్వు నా మనసుని పట్టుకున్నావు

ఓ ఫకీరూ నువ్వు నా మనసుని పట్టుకున్నావు.

నేను నా మందిరంలో నిద్రపోతూండగా నువ్వు నీ సంగీతంతో నన్ను తట్టిలేపావు.

ఈ భవసాగరంలో మునిగిపోతూండగా, నా బాహువులు పట్టుకుని పైకి లేపావు.

ఒకే ఒక్క మాట. మరోమాటతో పనిలేదు. నువ్వు నా బంధాలన్నిట్నీ తుంచేసావు.

సోదరులారా, సాధువులారా, వినండి. ఆ ఫకీరు ఒక బిగికౌగిలింతతో నా హృదయాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు.

24-12-2017

arrow

Painting: Abanindranath Tagore

Leave a Reply

%d bloggers like this: