తెలుగు అత్యుత్తమ సాహిత్యభాషల్లో ఒకటిగా వికసించినప్పటికీ, తాత్త్వికభాషగా, సాంకేతిక శాస్త్రాల భాషగా వికసించలేదనీ, అందుకు గాను, వివిధ దేశాల తత్త్వశాస్త్రరచనల్ని తెలుగులోకి అనువదించవలసిన అవసరం ఉందని భావిస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రయత్నం. 2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రంలో సత్యమీమాంస శాఖనుంచి ఎంపిక చేసిన 72 మంది తాత్త్వికుల రచనలనుండి చేసిన అనువాదాలతో పాటు, పాశ్చాత్యతత్త్వశాస్త్ర చరిత్ర స్థూలపరిచయం కూడా పొందుపరుచుకున్న గ్రంథం ‘సత్యాన్వేషణ’ (2003).
తెలుగు పాఠకప్రపంచం ఆదరణ పొందిన ఈ రచన అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ లభిస్తున్నది.