స్వాతంత్ర్యోద్యమసంగ్రామ కాలంలో దేశాన్ని జాగృతం చేసిన మహనీయుల్లో మహాత్మాగాంధి, రవీంద్రనాథ్ టాగోర్ ముందువరసలో నిలుస్తారు. గాంధీని టాగోర్ మహాత్మా అని సంబోధిస్తే, గాంధీ టాగోర్ ని గురుదేవ్ అని పిలిచేవారు. కాని, సహాయనిరాకరణోద్యమకాలంలో వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. అదొక ఆసక్తికరమైన సంవాదంగా రూపుదిద్దుకుంది. ఆ సంవాదం కూడా జాతిని మరింత జాగృతం చెయ్యడానికే సహకరించింది.
వారిద్దరి మధ్యా నడిచిన సంవాదాన్ని Truth Called Them Differently పేరిట నవజీవన్ వారు ఇంగ్లీషులో వెలువరించిన పుస్తకాన్ని ఎమెస్కో సంస్థ వారి ‘పొరుగునుంచి తెలుగులోకి’ శీర్షిక కింద వాడ్రేవు చినవీరభద్రుడు అనువదించడమే కాక, ఆ సంవాదం పైన సమగ్రమైన సమీక్షా వ్యాసం కూడా ఈ గ్రంథంలో అందించారు.
ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.