ఇరవయ్యవశతాబ్దిలో వికసించిన తెలుగు కథ పరిణామాన్ని పరిచయం చేస్తూ, వాడ్రేవు చినవీరభద్రుడు ఏరికూర్చిన ప్రతినిధికథలుగా చెప్పదగ్గ 26 కథల సంకలనం. గురజాడ అప్పారావు ‘మీ పేరేమిటి’ (1910) నుంచి గోపిని కరుణాకర్ ‘బారతం బొమ్మలు’ (1999) దాకా దాదాపు ఒక శతాబ్దకాలంపాటు తెలుగుకథలో సంభవించిన స్థూల, సూక్ష్మ పరిణామాల్ని దశాబ్దాల వారిగా వివరిస్తూ, text నీ, context నీ జమిలిగా అల్లిన అద్వితీయ ప్రయత్నం.
ఈ పుస్తకం అన్ని పుస్తక విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.