జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు

Reading Time: < 1 minute

09

ఆధునిక పాశ్చాత్యతత్త్వశాస్త్రంలో అత్యున్నత స్థాయి తాత్త్వికుడిగా పరిగణించబడుతున్న ఇమాన్యువల్ కాంట్ (1724-1804) రచనలనుండి ఎంపికచేసిన ప్రధానమైన భాగాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన అనువాదం. విస్తారమైన కాంట్ రచనలనుంచి ముఖ్యమైన భాగాలను ఎంపికచేయడం ఒక సవాలుకాగా, అత్యంత క్లిష్టమైన ఆ తాత్త్వికభాషను సరళమైన తెలుగుభాషలోకి తీసుకురావడం మరొకసవాలు. పీకాక్ పబ్లికేషన్స్ వారు 2008 లో ప్రచురించిన ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభిస్తుంది.

‘అనువాద ప్రక్రియకు, ముఖ్యంగా తత్త్వరచనల అనువాదప్రక్రియకు మొత్త విశేషాలను ఈ ప్రయత్నం ఆవిష్కరించింది. ఈ స్థాయిని చేరుకోవడానికి అనువాదకుని నేపథ్యం, భారతీయ తత్త్వశాస్త్రంపై సమగ్ర అవగాహన, కాంట్ రచనలలోని మూలభావాల మీద పట్టు, తెలుగుసాహిత్యభాషతోగల గొప్ప పరిచయం కారణాలు.’

ఆచార్య అడ్లూరి రఘురామరాజు

Leave a Reply

%d bloggers like this: