‘ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం’ డా. కలాం, ఆచార్య మహాప్రజ్ఞ అనే జైన సాధువుతో కలిసి రాసిన The Family and the Nation కు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం.
అవివాహితులూ, ప్రాపంచికార్థంలో తమకంటూ ఎటువంటి సొంతకుటుంబాల్లేని ఆ ఇద్దరు సాధువులూ పుస్తకం ముగిస్తూ రాసిన మాటలిట్లా ఉన్నాయి:
‘ఒక ఉదాత్తదేశం, ఒక ఉదాత్తజాతి ఎట్లా రూపొందగలవనే ప్రశ్నని మేం పదే పదే తరచి తరచి చూశాం. చివరికి మేం చేరుకున్న నిర్ణయమేమిటంటే ఉదాత్తదేశ బీజాలు కుటుంబంలోనే ఉన్నాయని, చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగి పెద్దవాడైన వ్యక్తి మాత్రమే జాతి పట్ల తన బాధ్యత గుర్తుపట్టగలుగుతాడు. అతడు మాత్రమే ‘నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా నెగ్గుకురావాలి ‘ అనే సూత్రాన్ని అనుసరించ గలుగుతాడు….చక్కటి కుటుంబాన్ని రూపొందిస్తే అది తిరిగి ఒక ఉదాత్త జాతినీ,ఒక ఉదాత్త దేశాన్నీ ఎట్లా సుసాధ్యం చేయగలదోనన్న ఆసక్తితోనూ, శ్రద్ధతోనూ ఈ పుస్తకాన్ని మీరంతా చదువుతారని మేమాశిస్తున్నాం ‘
రీమ్ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఈ గ్రంథం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభ్యమవుతున్నది.