డా. ధేనువకొండ శ్రీరామమూర్తిగారు లేరంటే చాలా బాధగా ఉంది. సహృదయుడు, సున్నితమనస్కుడు. మాటలోనూ, నడవడికలోనూ కూడా గొప్ప సంస్కారి. సున్నితమైన కవిత్వం చెప్పాడు. మాకు దూరపు బంధువు కూడా. కాని నాలుగైదు సార్లు మాత్రమే కలుసుకోగలిగాను. ఆయన రాసిన కవిత్వసంపుటి ఆవిష్కరణ సభలో ఆ కవిత్వం గురించి మాట్లాడేను కూడా. కాని, మరికొన్ని సార్లు కలుసుకోగలిగి ఉంటే బాగుండేది.
18-8-2017