ఎట్లాంటి ప్రేమ వర్షిస్తోందంటే

f1

ఈ మధ్య కాలంలో రోగర్ హౌస్డన్ కవిత్వాన్ని ఒక వ్యక్తిత్వ వికాస సాధనంగా ప్రచారం చేస్తున్నాడు. ఆయన రాసిన టెన్ పొయెంస్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఈ మధ్య పలమనేరు బాలాజీ కవిత్వం ‘ఇద్దరి మధ్య’ కు ముందుమాట రాస్తూ నేను ప్రస్తావించించింది ఈ హడ్సన్ గురించే.

ఆయన సంకలనం చేసిన మరొక పుస్తకం ‘ఫర్ లవర్స్ ఆఫ్ గాడ్ ఎవిరివేర్ ‘ (హే హౌస్, 2009) క్రైస్తవసాధువుల కవిత్వం. ఆ పుస్తకం కొని చాలాకాలమే అయినా ఈ మధ్యనే తీసి చూసాను. చాలా ప్రభావంతమైన కవిత్వం ఉంది అందులో. ఈ రోజు నా మిత్రులకోసం అందులోంచి ఒక కవిత. ఇది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ రాసిన కవిత:

Wring out my cloths

Such love does
the sky now pour
that whenever I stand in a field

I have to wring out the light
when I get
home.

దీన్ని తెలుగులో ఇలా అనువదించవచ్చు:

నేను బయట తిరుగుతున్నప్పుడు
ఆకాశం నుంచి

ఎట్లాంటి ప్రేమ వర్షిస్తోందంటే

కాంతిని విదిలించుకుని మరీ
ఇంటికి రావలసివస్తోంది.

దీనికి హౌస్డన్ రాసిన పరిచయ వాక్యాల్ని కూడా ఇలా తెలుగు చెయ్యవచ్చు:

‘అసీసికి చెందిన సాధువు ఫ్రాన్సిస్ నిజంగానే భగవంతుడి కోసం వెర్రిపడ్డవాడు. ఇటలీ ద్వీపకల్పంలో మైదానాల్లో ఒక రోజంతా తిరిగాక సాయంకాలం నిజంగానే అతడు తన పై పంచ నుంచి కాంతిని పిండుతుండే దృశ్యం నాకు కనిపిస్తోంది.తన సృష్టికర్త తనమీద వర్షించే ప్రేమకు అతడు పరవశించిపోయాడు. ఇంతకీ కాంతి అంటే ఏమిటి? అది ప్రేమ, జ్ఞానం సాకారం కావడమే కదా. దాన్లో అతడు తడిసి ముద్దయిపోయాడు. ఈ ఇంగ్లీషు అనువాదం దేనియల్ లాండిస్కీ చేసింది. ఈ చిన్న పదచిత్రంలో నిరాడంబరతా, ఉల్లాసమూ రెందూ సమంగా ప్రతిఫలిస్తున్నయి. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో ఎంత సేపు గడిపేవాడో ప్రకృతి మధ్య కూడా అంతసేపు గడిపేవాడు. అతడి హృదయానికీ, స్వభావానికీ తగ్గట్టే ఉంది ఈ కవిత కూడా’

ఇటువంటి కవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంకా ఇలాంటి కవితల్ని జుర్రుకోవాలనుకునేవాళ్ళు poetry-chaikhana.com చూడవచ్చు. శైలజగారూ, వింటున్నారా!

2-4-2013

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s