కావేరి

42

కావేరి నది పుష్కరాలు మొదలయ్యాయి. కావేరిని వాగ్గేయకారుల నది అన్నాడు అడవి బాపిరాజు. కర్ణాటక, తమిళదేశాలకి ప్రాణం పోసే కావేరిని నేను శ్రీరంగపట్టణం దగ్గర మాత్రమే చూసాను. అసలు చూడవలసింది చోళనాడులో కదా, తిరువయ్యారులో కదా. కాని తలకావేరి నుంచి తంజావూరుదాకా కావేరి ప్రవాహంలో మానసిక యాత్ర చేసే అవకాశాన్నిచ్చినవాడు కున్నకుడి వైద్యనాథన్. ఆయన రూపొందించిన ‘కావేరి‘. దీన్ని ఆయన 70 ల్లోనే కంపోజ్ చేసాడట. నేను విన్నది 80 ల మొదట్లో రాజమండ్రిలో ఉన్నప్పుడు. గోదావరి ఒడ్డున.

వినండి, ఒక నది వెంట, పల్లెల వెంట, పట్టణాల వెంట, దేవాలయ ప్రాంగణాలమ్మట, కొండనుంచి కడలిదాకా ప్రయాణించిన సుమనోహరమైన అనుభూతి కలుగుతుంది.

ఇందరు సంగీతకారులున్నారు మనకి, కాని ఒక్కరేనా కృష్ణమీదా, గోదావరి మీదా ఇట్లాంటి కూర్పు ఏదీ చెయ్యలేకపోయారే!

17-9-2017

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: